ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా..విధులను పక్కాగా నిర్వర్తించాలి
1 min readపోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అలసత్వం ప్రదర్శించరాదు.
ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఎవర్నీ ఉపేక్షించకండి.
రాయలసీమ యూనివర్సిటి కౌంటింగ్ వద్ద బందోబస్తు విధులు చేపట్టనున్న సిబ్బందికి దిశానిర్ధేశం… అడిషనల్ ఎస్పీలు నాగరాజు, నాగబాబు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేలా పకడ్బందీగా విధులు నిర్వహించాలని అడిషనల్ ఎస్పీలు నాగరాజు, నాగబాబులు ఆదేశించారు.ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో అడిషనల్ ఎస్పీలు సోమవారం స్థానిక కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో దిశానిర్ధేశం చేశారు.రాయలసీమ యూనివర్సీటి కౌంటింగ్ కేంద్రం వద్ద విధులు చేపట్టే టూవీలర్ మొబైల్ పార్టీలు, స్ట్రాంగు రూంల వద్ద బందోబస్తు, చుట్టూ పహారా కాస్తున్న పెట్రోలింగ్ పార్టీలు, రాయలసీమ యూనివర్సీటి వైపు అనుమతి లేని వారు రాకుండా ఆపేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు మరియు రాయలసీమ యూనివర్సీటి కి వచ్చి వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ నిర్వహించే సిబ్బంది పకడ్బందీ విధులు నిర్వహించాలి. ఏమి చేయాలో వారి విధులను తెలియజేశారు.ఎవరికి అప్పగించిన విధులను వారు పక్కాగా నిర్వర్తించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, పరిసరాల్లోకి రిటర్నింగుల అధికారుల అనుమతి పత్రం లేనిదే ఎవర్నీ అనుమతించొద్దన్నారు. కౌంటింగ్ ఏజంట్లు, అభ్యర్థులు, ఛీప్ ఏజంట్లు మరియు ఆర్ ఒ, ఎ ఆర్ ఒ, ఇతర అధికారులు, మీడియా ప్రతినిధులు నిర్ధేశిత మార్గాల ద్వారానే కౌంటింగు కేంద్రాల్లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతీ ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాల్ పెన్ / పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మినహా ఏవీ అనుమతించకుండా కౌంటింగు కేంద్రాల్లోకి పంపాలన్నారు.కౌంటింగు కేంద్రాలు, పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ , 30 పోలీసు యాక్టు అమలులో ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలో మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ బృందాలు, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలు అప్రమత్తంగా ఉంటూ తిరగాలన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.కౌంటింగు రోజున పోలీసులు బందోబస్తు ఎలా నిర్వహిస్తారో తెలుసుకుని ఇంకా లోటుపాట్లు ఏవైనా ఉంటే సర్దుబాటు చేసుకోవడానికి ఈరోజు రీహార్సల్స్ నిర్వహించారు.కౌంటింగ్ జరిగే రాయలసీమ యూనివర్సీటి , పరిసరాలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు అడిషనల్ ఎస్పీలు తెలియజేశారు. ఈసమావేశంలో పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.