జయసూర్య కే నందికొట్కూరు పట్టం..
1 min readఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్
వైకాపా అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ పై టిడిపి అభ్యర్థి జయసూర్య గెలుపు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అందరిలోనూ అదే టెన్షన్.. టెన్షన్ గత మే నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అప్పటి నుండి ఈనెల 4 వరకు 23 రోజులకు తెరపడింది కౌంటింగ్ ద్వారా.. నిన్న నంద్యాల లో ఆర్జిఎం కళాశాలలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రజల్లోనూ అందరిలోనూ టెన్షన్ పుట్టుకుంది.మా అభ్యర్థి గెలుస్తాడా..మా అభ్యర్థి గెలుస్తాడా అని గ్రామాల్లో ప్రతి ఇంటిలోనూ టీవీల ముందు హత్తుకు పోయారు.
టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్య గెలుపు..
నంద్యాల జిల్లా నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ పై కూటమి టిడిపి అభ్యర్థి గిత్త జయ సూర్య 9,248 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.వైసీపీ అభ్యర్థి ధార సుధీర్ కు-82,026.. టిడిపి అభ్యర్థి జయసూర్య కు 91,274 ఓట్లు పోల్ అయ్యాయి.నిన్న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. నందికొట్కూరులో మొత్తం 26 రౌండ్లలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ 8 రౌండ్లలో 3వ రౌండ్ లో 229..4వ రౌండులో 24..13 లో -292..18 లో -298..19లో -191..23లో -233..24లో -29..26లో -115 ఈ రౌండ్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మిగతా 18 రౌండ్లలో టిడిపి అభ్యర్థి ముందంజలోనే కొనసాగారు.నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లపాటు శాసించడానికి గిత్త జయసూర్య కు ఓటర్ ప్రజలు పట్టం కట్టారు.ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం దాసు గిత్త జయసుధకు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.ఎక్కడ చూసినా కార్యకర్తల ఆనందోత్సాహాలునందికొట్కూరు నియోజకవర్గంలో నిన్న మధ్యాహ్నం నుండే జయ సూర్య గెలుపు బాటలో ఉన్నారని తెలియడంతో భారీగా మాండ్ర శివానందరెడ్డి ఇంటికి చేరుకొన్నారు. పట్టణంలో మరియు వివిధ గ్రామాల్లో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా కేకులు కట్ చేసి ఆనందోత్సాహాలు టిడిపి అధికారంలోకి రావడంతో శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.