PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలి… ప్లాంట్ హెడ్. నవనీత్ కుమార్ చౌహన్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిందాల్ ప్లాంట్ హెడ్ నవనీత్ చౌహనతెలిపారు. బుధవారం.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిందాల్ ప్లాంట్ హెడ్ నవనీత్ చౌహన్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. అడవుల్లో చెట్లు మొక్కలు, వన్యప్రాణులు అంతరించిపోవడం వల్ల వాతావరణంలో సమతుల్యత లోపించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటీ మొక్కలను నీళ్లు పోసి మొక్కలను పెంచేబాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిందాల్ సిబ్బంది నరసింహారెడ్డి, అన్ని ప్లాంట్ హెడ్స్ అన్ని భాగాలు సిబ్బందులు కార్మికులు పాల్గొన్నారు.

About Author