19వేల పోలీస్ ఉద్యోగాలు.. భారీ నోటిఫికేషన్
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రాబోతోంది. 19 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తెలంగానలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కానుంది. 2014లో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. 2018లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆసమయంలో 1217 ఎస్సైలు, 16,925 కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. కొత్త జోనల్ వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించడంతో కొలువుల భర్తీకి మార్గం సుగమమైంది.