నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన సానియా దేశాయ్
1 min readఘనంగా సన్మానించిన ఆవాజ్ నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని పాతబస్తీ నందు నివాసం ఉండే సిపిఎం పార్టీ నాయకులు అబ్దుల్ దేశాయ్ కుమార్తె అయినటువంటి సానియా దేశాయ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అత్యధికంగా మార్కులను సాధించిన సందర్భంగా ఆమె ప్రతిభను కొనియాడుతూ ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఇలియాజ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆవాజ్ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుస్సేన్ షేక్ మొహమ్మద్ షరీఫ్ లు ముఖ్య అతిథులుగాహాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాలు పోరాటాలతో పాటు చదువులో కూడా రాణించడానికి తమ యొక్క పిల్లలకు ప్రోత్సాహాన్ని ఏ రకంగా ఇస్తున్నారు మన సానియా దేశాన్ని చూసి తెలుసుకోవచ్చని వారు కొనియాడారు ఇటువంటి ప్రతిభా కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గతం నుండి ఆవాజ్ కమిటీ ప్రోత్సహిస్తుందని వారు తెలియజేశారు అందులో ముస్లిం మైనార్టీ విద్యార్థులు విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారని అలాగే రాబోయే కాలంలో ఇటువంటి ఉత్తమ ఫలితాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు డాక్టర్ ఎంబీబీఎస్ సీటు తెచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ యొక్క సేవలు కొనసాగించాలని ప్రజలకు అందుబాటులో ఉండే మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆవాస్ కమిటీ నాయకులు ఆకాంక్షించారు ఈ సన్మాన అభినందన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ ఆవాజ్ నగర ఉపాధ్యక్షులు రశీదా దేశాయ్, ఖాజా పాషా,చాన్ బాషా ,డాక్టర్ సలీం ఆర్.ఎం.పి, హర్షద్ సాదిక్ భాషా తదితరులు పాల్గొన్నారు.