వర్షాకాలం డ్రైనేజీనీ శుభ్రంగా ఉంచండి – కమిషనర్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పట్టణంలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచే విధంగా మున్సిపల్ కార్మికులు ఉండాలని నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ టి.సుధాకర్ రెడ్డి కార్మికులతో అన్నారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో వాటర్ లైన్స్ శానిటరీ మేస్త్రీలు సచివాలయం శానిటేషన్ సెక్రటరీలు సచివాలయం సిబ్బందిలతో కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాల కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిల్వ ఉన్న నీటిని త్వరిత గతిన మరియు మెయిన్ డ్రైనేజీల్లో ఎటువంటి నిలువ లేకుండా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వర్షాకాలం ప్రారంభం అయినందున వాటర్ పొల్యూట్ కాకుండా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయుటకు చర్యలు చేపట్టాలని కమిషనర్ వారికి సూచించారు. కమిషనర్ కార్యాలయంలో సంబంధిత సెక్షన్ సిబ్బందికి అధికారులకు మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. అంతేకాకుండా నందికొట్కూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో గత వారం రోజులుగా ఉంటున్న నీళ్లను జెసీబీ సహాయంతో మున్సిపల్ కమిషనర్ డ్రైనేజీ ద్వారా నీళ్లను బయటికి పంపించారు.