‘ జేఈఈ అడ్వాన్డ్స్ ’ లో SR విద్యార్థుల విజయ కేతనం
1 min readఅద్బుత ఫలితాలతో రికార్డు
- విద్యార్థులను అభినందించిన జోనల్ ఇన్చార్జ్ రఘువీర్
కర్నూలు, పల్లెవెలుగు: NTA విడుదల చేసిన 2024 ఫలితాలలో SR విద్యాసంస్థల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. కర్నూల్ జిల్లాలలో రెసిడెన్షియల్ కళాశాల నుండి అద్భుత ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారని SR విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ టి.రఘువీర్ తెలిజేశారు. JEE ADVANCE 2024 వివిధ కేటగిరీలలో పి. రాకేష్ కుమార్ ర్యాంక్ 36, వడ్డే వచన్ రెడ్డి 127, ఎం.మల్లు నాయక్ 1186, S. బద్రీనాథ్ రెడ్డి 3639, వై.మినిత్ కుమార్ 5086, ఎం.చరన్ తేజ్ 5988 ప్రతిభను చాటారు. ఈ విజయనికి కృషి చేసిన ప్రిన్స్ పాల్స్ కు మరియు లెక్చరర్లకు, బోదనేతర సిబ్బందిని టి, రఘువీర్ అభినందించారు. సాదారణ గ్రామీణ స్థాయి విద్యార్థులతో JEE ADVANCE 2024 లో టాప్ ర్యాంకులను సాదించి తల్లిదండ్రులకు, గురువులకు, విద్యాసంస్థకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన విద్యార్థులను టి. రఘువీర్ వారిని అభినందించారు. S R విద్యాసంస్థల అధినేత . వరదా రెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, C.E.O. సురేందర్ రెడ్డి, G.M రాజేంద్రప్రసాద్ కు కర్నూలు జోనల్ ఇంచార్జ్.టి.రఘువీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం విడుదలైనటువంటి అన్ని జాతీయ మరియు రాష్ట్రస్థాయి పరీక్ష ఫలితాలలో కర్నూలు SR కాలేజీ యే నెంబర్ 01 అని మరోసారి నిరూపించామని ఈ సందర్భంగా SR విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ టి.రఘువీర్ వెల్లడించారు.