శ్రీ విశ్వావసు ఉగాది..
1 min read
ఆ మంచి విశ్వేశ్వర శర్మ, ప్రముఖ పురోహితులు, కర్నూలు.
సెల్.9440047027 , 9110579730
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు అత్యంత వేడుకగా.. ఆనందంగా జరుపుకునే తొలి అతి పెద్ద పండగ ఉగాది. దీన్నే నూతన సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఈ పండగ ప్రతి సంవత్సరం చైత్ర మాసం, శుక్ల పాఢ్యమి తిథి నందు వస్తుంది. ఈ సంవత్సరం వచ్చిన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. ఇది తిరిగి 60 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ పండగ రోజున అందరూ శిర స్నానం చేసి నూతన వస్ర్తాలు ధరించి షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడిని చేసి దేవుడికి నివేదన చేసి తరువాత ప్రసాదంగా తీసుకుంటారు. సాయంకాలము అంతా కలిసి దేవాలయాల దగ్గరకు వెళ్తారు. అచ్చట పండితోత్తముల చేత పంచాంగం శ్రవణం చెప్పిస్తుంటారు. పంచ + అంగము = ఐదు అంగములు (తిథి, వారము, నక్షత్రం, కరణము, యోగం) రాబోయే సంవత్సరం ఎలాం+టి ఫలితాలను అందిస్తుందో వివరాలు అందులో ఉంటాయి. వాటిని తెలుసుకుని ప్రజలు తమకు జరగబోయే ఫలితాలను తెలుసుకుని ఆనందిస్తుంటారు.
ఉదాహరణకు.. ఈ విశ్వవసు నామ సంవత్సరమును పరిపాలించే నవ నాయకుల్లో నలుగురు మంచివారు.. ఐదుగురు పాపులు. మొత్తమ్మీద 30 మందిలో కూడా 14 మందే శుభులు. అందువల్ల పరిపాలన పూర్తి తృప్తిగా ఉండకపోవచ్చు. కొంత ఆలస్యమైనా వర్షాలు తృప్తిగా పడతాయి. పంటలు బాగానే పండుతాయి. ఎక్కువగా ఎర్రధాన్యము, టమోటా, మిర్చి, కందులు, ఉల్లిగడ్డ, క్యారెట్ లాంటి వాటికి ధర ఎక్కువ. రెండు సార్లు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఒక సారి ఒక నెల.. మరోసారి రెండు నెలలు వెరసి మూడు మాసములు. గురు, శుక్ర మౌఢ్యమిలు వస్తున్నాయి. ఆర్ర్ధ మరియు మృగ శిర కార్తెలు రెండూ ఉదయం పూటనే వస్తున్నందున వర్షం యొక్క సాంధ్రత తగ్గుతుంది. మకర సంక్రాంతి పురుషుడు పెద్ద పులి వాహనం మీద వెళ్తున్నాడు. ఇవియే గాకుండా ఆదాయం ఎంత ? ఖర్చు ఎంత ? రాజ్య పుజ్యము ఎంత , అవమానం ఎంత, ఎన్ని సున్నాలు వస్తాయి లాంటివి కూడా తెలుసుకుని సంతోషిస్తు ఉంటారు.