NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన హంగులతో మున్సిపల్ మినీ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం

1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్,డిప్యూటీ మేయర్లు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :  ఏలూరు నగరాన్ని మరింత సుందరీకరించేందుకు అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతన హంగులతో రీ మోడల్ చేసిన మినీ కాన్ఫరెన్స్ హాల్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు మంగళవారం ప్రారంభించారు. తొలుత రిబ్బన్‌ కట్‌ చేసి హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, మేయర్‌లు అనంతరం పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన మినీ కార్ఫెరెన్స్‌ హాల్‌ సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయుక్తమన్నారు. ఈక్రమంలో ఏలూరు నగరం అభివృద్ధితో పాటూ సుందరీకరణలోనూ అగ్రభాగాన నిలిచేలా కార్పొరేషన్‌ అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలెదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేయడంతో పాటూ ఆ పనులన్నింటినీ ఈ వేసవిలోనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బందితో ఎప్పుటికప్పుడు రివ్యూ మీటింగ్‌లు నిర్వహించుకునేందుకు ఈ మినీ కాన్ఫెరెన్స్‌ హాల్‌ ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌ మాట్లాడుతూ అభివృద్ధిపై మేధో మథనం చేసేందుకు ఈ హాల్‌ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ అదనపు కమిషనర్ జి. చంద్రయ్య, ఎంఈ సురేంద్రబాబు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం,ఎస్ ఎం ఆర్ పెదబాబు, జాల సుమతి పలువురు కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు వందనాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author