సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని వివిధ కారణాల రీత్యా అనారోగ్య పరిస్థితుల్లో వైద్యం కోసం ఆసుపత్రులలో ఖర్చులు చేసిన 14 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 10 లక్షల 93,600 రూపాయలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులనుపత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ స్థానిక టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.మద్దికేర మండలం ఎం అగ్రహారానికి చెందిన జి.జయశ్రీ కుటుంబానికి 31112/- రూపాయలు, క్రిష్ణగిరి మండలం క్రిష్ణగిరి గ్రామానికి చెందిన మజ్జిగ లక్ష్మీదేవికి 81000/- రూపాయలు క్రిష్ణగిరి మండలం టి. గోకుల్ పాడు కు చెందిన పింజరి వన్నూరుకి 71000/-రూపాయలు, క్రిష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన చింతమాను గాయత్రికి 3500/-రూపాయలు, క్రిష్ణగిరి మండలం అముకుతాడు గ్రామానికి చెందిన హనుమంతు రెడ్డికి 1,42,680/- రూపాయలు, వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన ఎముగాని లక్ష్మీదేవి కుటుంబానికి 30028/-రూపాయలు, వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన బాసం లక్ష్మీదేవికి 23920/- రూపాయలు, తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామానికి చెందిన మహానంది కుటుంబానికి 50000/-రూపాయలు, తుగ్గలి మండలం రామకొండ గ్రామానికి చెంది.