జిల్లా స్థూల ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం
1 min read
దేశీయ ఉత్పత్తుల పెంపకానికి పెద్ద ఎత్తున చర్యలు
జిల్లాను పెట్టుబడికి అనుకూలమైన జిల్లాగా తీర్చిదిద్దుతాం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలలో 15 శాతం ప్లస్ గ్రోత్ రేట్ సాధించే దిశగా జిల్లా ప్రగతి ప్రణాళికలను రూపొందించడంతోపాటు స్థూల ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు నంద్యాల జిల్లా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలను 15 శాతం ప్లస్ గ్రోత్ రేట్ సాధించే విధంగా తయారు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పర్యాటకం వల్ల 43 శాతం, సర్వీసు విభాగం ద్వారా 39 శాతం, పరిశ్రమల వల్ల 18 శాతం మొత్తంగా వంద శాతం జీవిఆర్ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నాయన్నారు. జిల్లాను 46వేల 555 కోట్ల జివిఎకు (గ్రాస్ వాల్యూ అడెడ్)ను 15.45 శాతంతో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి జిల్లాలో 65 శాతం బీడు భూములు ఉన్నాయని, వాటిలో సుమారు 40 వేల ఎకరాల్లో భూసాంద్రతను బట్టి సోయా, బజ్రా, బ్లాక్ గ్రాం తదితర వాటిని పెంచడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల సహకారంతో పాటు స్పెషల్ సిఎస్ఆర్, వ్యవసాయ యూనివర్సిటీ సహకారం కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాలో దేశీ రకాల ఉత్పత్తులను పెంచడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో హార్టికల్చర్, లైవ్ స్టాక్ అభివృద్ధికి వున్న విస్తృత అవకాశాలన్ని సద్వినియోగం చేసుకుంటూ తలసరి ఆదాయాన్ని పెంచాలన్నారు. ఉద్యానవన పంటల సాగు విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు. ప్రత్యేకించి జోన్ 5 లోని అనంతపురం, నంద్యాల, శ్రీ సత్య సాయి, కర్నూలు మరియు వైఎస్ఆర్ కడప తదితర ఐదు జిల్లాల్లో ఉద్యాన పంటలను విస్తృత స్థాయిలో సాగు చేయడం జరుగుతోందన్నారు. ఈ పంటల సాగు విషయంలో ప్రి హార్వెస్టింగ్ , హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ లో ఉత్తమ విధానాలను అమల్లోకి తెచ్చే అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన ఉత్పత్తులకు తగిన ధరలు వచ్చేంతవరకు రైతులు నిలువ చేసుకునే విధంగా కోల్డ్ చైన్ లింకేజీ సౌకర్యాలను పెంచడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పరచాలని సియం దిశానిర్దేశం చేశారు. జోన్ లోని ఐదు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా పనిచేసే విధంగా అవకాశం కల్పించేందుకై ప్రతి గృహానికి బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. టెంపుల్ టూరిజనికి విస్తృత స్థాయిలో అవకాశాలు వున్నాయని టెంపుల్ టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సియం తెలిపారు. ఋతుపవనాలు వచ్చే లోపే ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించడం ద్వారా భూగర్భ జలాల మట్టాలను పెంచే విధంగా జిల్లా కలెక్టర్లు అందరూ ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఋతుపవనాలు తదుపరి చెరువులు, రిజర్వాయర్ల లోని భూ ఉపరితల జల మట్టాలు తగిన స్థాయిలో నిలువ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కెనాల్సు ద్వారా ప్రవహించే జలాలను కూడా పరిరక్షించే విధంగా స్ట్రక్చర్ల నిర్మించాలన్నారు. నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.