NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలీవుడ్​ పిలుస్తోంది..

1 min read

సినిమా డెస్క్​: తెలుగులో గల్ఫ్‌, యురేక, గద్దలకొండ గణేష్​ చిత్రాల్లో నటించిన డింపుల్‌ హయాతిని బాలీవుడ్‌ పిలుస్తోందట. ప్రస్తుతం మాస్‌ మహారాజ రవితేజ చిత్రం ‘ఖిలాడి’లో నటిస్తోంది.ఇందులో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న డింపుల్ హయాతికి బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీని జయంతీలాల్ గడ సమర్పణలో హిందీలో పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో డింపుల్ మీద బాలీవుడ్ మేకర్స్ దృష్టిపడిందట.

క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్శంకర్, – రణవీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌లో తీస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో డింపుల్‌ ఓపాత్ర పోషించనుందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ హీరోగా వస్తున్న మరో సినిమాలోనూ డింపుల్‌ని హీరోయిన్‌గా ఎంపికచేసుకున్నట్టు సమాచారం. త్వరలో వీటిపై అధికారక ప్రకటన రానుందట.

About Author