NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం

1 min read

ప్రవేశపెట్టిన 211 కోట్ల 34 లక్షల 18 వేల బడ్జెట్  అంచనాలు

సభ్యుల హర్షద్వనాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదం

నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : నగర పాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో 2025-2026 సంవత్సరాల సంబంధించి నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రవేశపెట్టిన 211 కోట్ల 34 లక్షల 18 వేల రూపాయల బడ్జెట్ అంచనాలను సమావేశం సభ్యుల హర్షద్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు అంచనాలను తెలియజేస్తూ ప్రారంభ నిల్వ 46 కోట్ల 20 లక్షల 18 వేలు చూపుగా, జమలు 165 కోట్ల 14 లక్షల రూపాయలు. జమలు,నిల్వ కలిపి మొత్తముగా 211 కోట్ల 34 లక్షల 18 వేల రూపాయలుగా చూపడం జరిగిం దన్నారు వీటిలో ఖర్చులు 1999 కోట్ల 51 లక్షల 85 వేలు చూపగా. 2026-2027 ముగింపు నిల్వగా 11 కోట్ల 82 లక్షల 33 వేల రూపాయలు చూపించడం జరిగిందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.ఖర్చులు,జమలు నిల్వలకు సంబంధించిన వివరాలను మేయర్ నూర్జహాన్ పెదబాబు ఈ విధంగా తెలిపారు.ఆస్తి పన్ను,ఖాళీ స్థలాలు పన్ను, స్టాంప్ డ్యూటీ పై  సర్ చార్జీలు,మార్కెట్లు మరియు షాపు రూమ్స్, వాటర్ చార్జీలు, డిపాజిట్లు మరియు అడ్వాన్సులుగా కార్పొరేషన్కు 80 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చునని అంచనా వేసేమన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్లు,15 వ ఆర్థిక సంఘం గ్రాంట్లు,స్వచ్ఛభారత్ గ్రాంట్లు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్  గ్రాంట్లు,ఏసిడిపి మొదలగు గ్రాంట్లు రూపేనా 84 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చిన అని అంచనా వేశామన్నారు. ఖర్చులు 199 కోట్ల 51 లక్ష రూపాయలు 85 వేల రూపాయలు చూపగా 11 కోట్ల 82 లక్షల 37 వేల రూపాయలు నిల్వ చూపించడం జరిగింది అన్నారు. నగరపాలక సంస్థకు సమకూరిన నిధుల నుండి ప్రభుత్వం నిబంధనల ప్రకారం షెడ్యూల్ కులములు నివసించి ప్రాంతాల అభివృద్ధికి, షెడ్యూలు తరగతుల వారు నివసించు ప్రాంతాల  అభివృద్ధికి, స్త్రీ శిశు సంక్షేమానికి, సంక్షేమానికి, మురికివాడల అభివృద్ధికి, సాధారణ ఖర్చులు, వికలాంగులకు సంబంధించి. మూలధనం నుండి 18 కోట్ల 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని మెయిన్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని సెక్షన్ల అధికారులతో చర్చించి. ఆదాయం,నిల్వలు, ఖర్చులు,మిగులు నిధులు సరి చూసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్అని మేయర్ నూర్జహాన్ పెదబాబు వివరించారు. గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు క్యాప్షన్స్ సభ్యులందరూ ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  సమావేశంలో కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,చోడే వెంకటరత్నం,డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు,వందరాణి దుర్గాభవాని శ్రీనివాసరావు పలువురు టిడిపి వైసిపి కార్పొరేటర్లు కమిషనర్ ఏ భాను ప్రతాప్,అదనపు కమిషనర్ జి.చంద్రయ్య,డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి,ఎం.ఈ సురేంద్రబాబు అన్ని సెక్షన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *