ముసలాయచెరువులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readరామకథ మధురాతి మధురం
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ సాహిత్యంలో రామకథకు ఎంతో విశిష్టత ఉన్నదని, ప్రపంచంలో ఎన్నెన్నో దేశాలలో ఆయా భాషలలో రామకథ వ్యాప్తి చెందినదని, అటువంటి రామకథను తెలుసుకుని ఆ మార్గంలో జీవించుటకు ప్రయత్నిస్తే సమాజం శాంతి సుస్థిరతలు ఏర్పడతాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, బేతంచెర్ల మండలం, ముసలాయచెరువు గ్రామంలో వెలసిన శ్రీ రామాలయం నందు నాలుగు రోజుల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శ్రీమద్రామాయణ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రచారకులు మద్దయ్య స్వామి ధార్మిక ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు బి.సోమేశ్వర రెడ్డి, భజన మండలి అధ్యక్షులు యాళ్ళూరి వెంకట కృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, అర్చకులు కె.సుంకులయ్య, డి.లక్ష్మయ్య, జె.సంజీవుడు, దొడ్డి తిరిపాలు, కె. సుబ్బారెడ్డి, కె.సుదర్శన రెడ్డి, యం.రమేశ్ రెడ్డి, చల్లా చిన్నపుల్లయ్య, కె. సుబ్బరాయుడు, సి.చిన్నయ్య, జె.సుబ్బరాయుడు, జె.రాంపుల్లయ్య, ఈశ్వరయ్య యం.వెంకటేశ్వర రెడ్డి, యం.వెంకటేశ్వర్లు, చల్లా పెద్ద యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.