కురువ సవితమ్మకు మంత్రి పదవి ఇవ్వడంపై హర్షం
1 min readకర్నూలు జిల్లా కురవ సంఘం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీ కర్నూలు ,హిందూపురం ఎంపీలు బస్తిపాడు నాగరాజు, బి.కె. పార్థసారథి, ఒక ఎమ్మెల్యే ఎస్. సవితమ్మకు ఇచ్చారు. అందులో ఎమ్మెల్యే సవితమ్మకు మంత్రి పదవి కేటాయింపు పై హర్షం వ్యక్తం చేస్తూ, చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కర్నూలు జిల్లా కురవ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,పెద్దపాడు ధనుంజయ జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కురువల కు నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. పార్టీ అధికారంలోకి రావడానికి అత్యధికంగా, నమ్మకంగా కృషిచేసిన కులం ఏదైనా ఉందా అంటే అది కురువ కులమని వారు పేర్కొన్నారు. మా కష్టానికి ఫలితంగా నామినేటెడ్ పదవుల్లో కురువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రకటనలో కోరారు.