నీటి కోసం డిఈ ని చుట్టు ముట్టిన మహిళలు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మారుతి నగర్ లో గత రెండు నెలల నుంచి త్రాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో డిఈ నాయబ్ రసూల్ ను ఆ కాలనీ మహిళలు శాంతమ్మ,డి సరోజమ్మ,పద్మావతి, మరియమ్మ,పద్మ,రామలక్ష్మమ్మ తదితరులు ఆయనను చుట్టుముట్టారు.కొంతసేపు మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ కు వినతిపత్రం అందజేయడానికి వెళుతుండగా మీ కాలానీలో ఉన్న నీటి సమస్య నేను చేయిస్తానని అన్నారు.మేము చాలా రోజుల నుండి ఇతర కాలనీలోకి నీళ్ల కోసం వెళ్తున్నామని అయినా నీళ్లు దొరకడం లేదన్నారు.కాలనీలో త్రాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని మహిళలు త్వరగా నాకు రెండు నెలలు సమయం ఇవ్వండి ట్యాంకులు కట్టిస్తామని డిఈ మహిళలకు హామీ ఇచ్చారు.ఎన్నిసార్లు చెప్పినా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ ఎవ్వ రూ పట్టించుకోవడం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వినతి పత్రాన్ని మహిళలు డిఈ కి అందజేశారు.ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మహిళలతో అన్నారు.