డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం
1 min read
ఏప్రిల్ 30వ తేదీ వరకు కన్సల్టెన్సీ ఫీజు లేకుండా ఫ్రీ చెకప్
అత్యాధునిక టెక్నాలజీతో శాస్త్ర చికిత్సలు,కంటి పరీక్షలు
ఏలూరు నగరంలో 21వ బ్రాంచ్ ప్రారంభం
24 గంటలు ప్రజలకు అందుబాటులోసేవలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నూతన బ్రాంచ్ ను గురువారం డాక్టర్ విజయ, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ గణేష్, డాక్టర్ టి. శాంత ఏలూరు , డాక్టర్ కెకె ఆర్ చక్రవర్తి విజయవాడ వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేకేఆర్ చక్రవర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 20 బ్రాంచ్ లు ఇప్పటివరకు ప్రారంభించామని ఏలూరులో డాక్టర్ అగర్వాల్ 21వ బ్రాంచి ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. కంటికి సంబంధించిన అన్ని శస్త్ర చికిత్సలు, అత్యాధునిక టెక్నాలజీతో 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారని తెలియచేసారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిలో ఏప్రిల్ 30 వరకు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఫ్రీ చెకప్ అందిస్తామని తెలిపారు. అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఏలూరు ప్రజలందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. శాంత ఏలూరు , డాక్టర్ కేకేఆర్ చక్రవర్తి విజయవాడ, వైస్ ప్రెసిడెంట్ గణేష్, డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి సిబ్బంది మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.