పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మధుబాబు ఎన్నిక
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ వై మధు బాబు ఎన్నికయ్యారు. గురువారం పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ కు జరిగిన హోరాహోరీ ఎన్నికలలో 28 ఓట్ల మెజార్టీ తో వై. మధుబాబు గెలిచారు. గురువారం పత్తికొండ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం ఎన్నికల అధికారి మైరాముడు ఆధ్వర్యంలో అధ్యక్ష మరియు ప్యానెల్ ఎన్నికకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న 97 మంది న్యాయవాదులలో 91 మంది న్యాయవాదులు ఓటును సద్వినియోగం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మైరాముడు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలను అధికారి ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా వై. మధుబాబు (28 ఓట్ల మెజార్టీ), ఉపాధ్యక్షులుగా జె.రవికుమార్ (9 ఓట్ల మెజార్టీ), జనరల్ సెక్రటరీగా జి.భాస్కర్ (21 ఓట్ల మెజార్టీ), ట్రెజరర్ గా ఎస్.బి.సురజ్ నబి (17 ఓట్ల మెజార్టీ), లైబ్రరీ అండ్ జాయింట్ సెక్రటరీగా ఎం.నరసరావు (25 ఓట్ల మెజార్టీ)తో గెలిచినట్లు ఎన్నికల అధికారి మైరాముడు తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి నుండి డిక్లరేషన్ అందుకున్న నూతన అధ్యక్ష మరియు ప్యానెల్ సభ్యులను న్యాయవాదులతో పాటు మిత్రులు, అభిమానులు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు జటంగి రాజు, నెట్టేకల్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.