బెల్ట్ షాపులపై దాడులు.. 24 మంది బైండోవర్
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలోని గోపవరం గ్రామంలో బెల్ట్ షాప్ లపై దాడులు నిర్వహించి 13 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని నంద్యాల ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి గురువారం పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. దీంతోపాటు నవోదయ రెండు లో భాగంగా పాణ్యం మండలానికి చెందిన నాటు సారా విక్రయించే పాత ముద్దాయిలు 24 మందిని బైండోవర్ చేసి పాణ్యం తాసిల్దార్ ముందు హాజరు పరిచామన్నారు. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపర్డెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. నాటు సారా అమ్మకం, తయారీ, గంజాయి క్రయవిక్రయాలు తదితర వాటికి సంబంధించి సమాచారం అందజేస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.4 మద్యం షాపులను తనిఖీ చేసి వాటి నుండి నమూనాలు సేకరించమని ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు.