బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
1 min readబాల కార్మిక వ్యవస్థకు నిరోధం,
అసంఘటిత కార్మికుల సంక్షేమం పై అవగాహన సదస్సు
బాల కార్మికుల వ్యవస్థను నిరోధించవలసిన అవసరం ఉంది
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్
ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికుల పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం
డిప్యూటీ లేబర్ ఆఫ్ కమిషనర్శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారు సంయుక్తముగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు బాల కార్మిక వ్యవస్థకు నిరోధం మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమము అంశాల పైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాల కార్మిక వ్యవస్థను సమూలముగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమిష్టి కృషితో మాత్రమే చేయగలమని సూచించారు. ఎవరైనా బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు పౌరుల దృష్టికి వచ్చిన సంబంధిత అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. చదువును మధ్యలో ఆపివేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడం మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం చేయాలని సూచించారు. ఆర్థిక స్తోమత లేని బాలబాలికలకు ప్రభుత్వము ఉచితంగా విద్య ఆహార ఏర్పాటు చేస్తున్నారు కావున వాటిని ఉపయోగించుకుని బాలబాలికలు ఉన్నతన విద్యను అభ్యసించాలని సూచించారు. అలాగే అసంఘటిత కార్మికులు తమ యొక్క వివరాలను ఇ-శ్రాం పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని తద్వారా వివిధ సంక్షేమ పథకాలను పొందటానికి అర్హత ఉంటుందని సూచించారు మరియు కర్మాగారాలలో సంబంధిత సిబ్బందికి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారి యొక్క పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు, ఎ.డి.ఇ. వెంకట అవధాని, రాధాకృష్ణ, ఏ.ఎల్. యస్, సర్వ శిక్ష అభియాన్, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్, రవి, ప్యానల్ అడ్వకేట్ పి రత్నరాజు, కూనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.