గ్రామంలో రెగ్యులర్ టీచర్లను నియమించాలి..
1 min readపాఠశాలలో రెగ్యులర్ టీచర్లను నియమించేంతవరకు పాఠశాలకు తాళాలు వేసిన గార్లదిన్నె విద్యార్థుల తల్లిదండ్రులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామంలో రెగ్యులర్ టీచర్లు నియమించాలని అక్కడ తాత్కాలికంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా గురుస్వామి ని పాఠశాల నుండి బయటకు పంపించి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఎంపీపీ ఎస్ పాఠశాలలో రెగ్యులర్ టీచర్స్ లేక(90)మందివిద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఉన్నటువంటి రెగ్యులర్ టీచర్లు ప్రమోషన్ మీదగా అక్కడి నుండి బదిలీ అయ్యారని అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క రెగ్యులర్ టీచర్ ని కూడా వేయలేదు వేసినటువంటి ఒకే ఒక్క తాత్కాలిక టీచర్ అని ఐదవ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకు ముందు తరగతులకు వెళ్లడానికి టిసి కావాలి ఆ టీసీలపైన రెగ్యులర్ టీచర్స్ సంతకం ఉండాలి కానీ మా పాఠశాలలో రెగ్యులర్ టీచర్ లేనందుకు సంతకాలు చేయడానికి ఏ టీచర్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని అదేవిధంగా గతంలో ఈ సమస్య పైన గ్రామస్తులందారం కలసి జిల్లా విద్యాధికారులకు మండల విద్యాధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న, ఎన్నో నిరసనలు తెలిపిన కూడా ఎటువంటి స్పందన లేకపోవడం అంటే చాలా బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు ఇకనైనా విద్యాధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని గార్లదిన్నె గ్రామం ఎంపీపీ ఎస్ పాఠశాలకు రెగ్యులర్ టీచర్లు నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులుగా కోరుతున్నాం లేనిపక్షంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుధాకర్, దావీదు, రాజన్న, ప్రతాప్ దేవిపుత్ర హుసేని , దినేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.