ఫ్యాక్షన్ గ్రామాలలో కార్డెన్ సర్చ్
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఫ్యాక్షన్ గ్రామాలలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేశారు. సీఐ జీవన్ గంగనాథ్ బాబు, ఎస్ఐలు శ్రీధర్, పి. సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు గడివేముల మండలంలోని మంచాలకట్ట , పెసరవాయి గ్రామాలలోని ఇరువర్గాల నాయకుల ఇళ్లల్లో సోదా చేశారు. మంచాలకట్ట గ్రామంలో ఎటువంటి పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ జీవన్ గంగనాథ్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఐ సూచించారు.