PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  అడ్డగోలుగా ఫీజులు  వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏ.ఐ. యస్.ఎఫ్.జిల్లా అధ్యక్షులు ది.సోమన్న కోరారు. శనివారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్  పత్తికొండ మండల ముఖ్య నాయకుల సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు డి సోమన్న జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్రి అల్తాఫ్ మాట్లాడుతూ, పత్తికొండ మండలంలో రేకుల షెడ్లలో చిన్నచిన్న రూములలో పాఠశాలలు నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వేలకు వేలు ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు.అయినా మండల విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే అధిక ఫీజులని అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని, పాఠ్యపుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థలను గుర్తింపు రద్దు చేయాలని కోరారు. లేని యెడల ఏఐఎస్ఎఫ్ గా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఎంఈఓ ఆఫీస్ ముందర ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గమైన కూడా ఇప్పటివరకు చదువుకునేటువంటి విద్యార్థులకు కనీసం హాస్టల్ వసతి కూడా కల్పించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యమని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో బిసి బాలుర బాలికల హాస్టల్ లను ఏర్పాటు చేయాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అదనపు సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

About Author