NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై  చర్యలు తీసుకోవాలి

1 min read

ఎమ్ఆర్ఓ కి వినతిపత్రం అందచేసిన ఆర్పీ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది

ఎమ్మిగనూరు  న్యూస్ నేడు:  ఎమ్మిగన పట్టణంలో ఉన్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు మరియు డొనేషన్లు వసూలు చేస్తు విద్యార్థుల తల్లితండ్రులు నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు అని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ (ఉచిత నిర్భంద విద్య )ద్వారా 25% అడ్మిషన్స్ కేటాయించలి అని జీవో ఇవ్వగా ఎమ్మిగనూరు లో కొన్ని పాఠశాలలు అడ్మిషన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయం పై విద్య శాఖ అధికారులుకీ తెలిపిన కూడా వారు మాకు ఎటువంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని  వారు అన్నారు. కావున ఇప్పటికి అయినా అధికారులు స్పందించి ప్రభుత్వం నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని సిజ్ చేయాలి అని అన్నారు. అనంతరం ఎమ్ఆర్ఓ  సానుకూలంగా స్పందించి అటువంటి పాఠశాలలకు నోటీసులు పంపిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కలంభాష, ఉదయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

About Author