ప్రశాంతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలి
1 min read-పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సమావేశంలో మాట్లాడుతున్న వత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సోమవారం జరిగే బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు, హొళగుంద ఎస్ఐ పెద్దయ్యనాయుడుతో కలిసి హిందు, ముస్లీంలతో పాటు గ్రామపెద్దలతో సమావేశం (పీస్ మీటింగ్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుని మత సామరస్యాన్ని పెంపోదించాలన్నారు. కర్ణాటక పక్కనే ఉన్న ఇక్కడి ప్రజలు సౌమ్యులని అందరు ఐక్యమత్యంగ ఉంటారన్నారు. అయితే కొందరి కారణాల వల్ల అందరు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వందుగ అనేది ఆనందంగ జరుపుకోవడానికే తప్పా ఆకతాయి చేష్టలతో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించకుండ అల్లర్లు సృష్టించి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగెందుకు కాదన్నారు. అలాంటి వారి పై నిఘా ఉంటుందని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టానికి ఎవరు చుట్టాలు కారని చట్టాన్ని చేతులో తీసుకుంటామని ఊరుకునేది లేదని కేసులతో బంగారు భవిషత్తు నాశనం చేసుకోవద్దని హితువు వలికారు. గ్రామంలో ప్రకాంత వాతవరణానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగెలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటిరి రాజశేఖర్, ఆరి దినోజ్ గ్రామస్తులు పాల్గొన్నారు.