మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం
1 min readశారీరక వ్యాయామంతో పాటు ఆహారంలో పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు
దేశ భవిష్యత్తును నిర్దేశించి చిన్నారులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దేందుకు క్రీడలు ఉపయోగపడతాయి
మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శారీరక వ్యాయామంతో పాటు ప్రతిరోజు పండ్లను తినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించవచ్చని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా నగరంలోని లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మె రుగుపడి జీవనశలికి సంబంధించిన వ్యాధులకు గురి కాకుండా జీవించవచ్చని చెప్పారు. ఇటీవల కాలంలో జీవనశైలి కి సంబంధించిన ఊబకాయం, బిపి, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు అధికం అవుతున్నాయని, వాటికి దూరంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం కల్పించే క్రీడల్లో సాధన చేయాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తును నిర్దేశించి చిన్నారులను క్రమశిక్షణ పౌరులుగా తీర్చిదిద్దేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. సముద్రం, నదులు ,తీరాలు వంటి ప్రకృతి వనరులతో పాటు దేశ భవిష్యత్తును నిర్దేశించే చిన్నారులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సంసార, సామాజిక ,పర్యావరణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వ్యక్తిగా తమను తాము మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడంతోపాటు కుటుంబ పరంగా సంసార బాధ్యతలను, అలాగే సమాజంలో అందరిని గౌరవించేలా వ్యవహరించడంతోపాటు చెట్లను నరకడం వంటి కార్యక్రమాలకు దూరంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన వివరించారు. చిన్నారులు పండ్లను తినడం వల్ల వాటిలో ఉండే విటమిన్ ఏ,సీ తో పాటు కాల్షియం, పొటాషియం ,మెగ్నీషియం వంటివి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. విద్యార్థులు వేసవి సెలవులను ఇతర కార్యక్రమాలతో దుర్వినియోగం చేయకుండా క్రీడల్లో సాధన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని వెల్లడించారు .కర్నూల్ నగరంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.