మేఘాల పై ఊరు.. అక్కడ వర్షం పడదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు. ఆ ఊరి జనం వర్షపు చుక్క స్పర్శను కూడ ఎరుగరు. అసలు ఆ ఊర్లో ఎందుకు వర్షం పడదు ?. ఉదయం, రాత్రి మాత్రం ఉంటాయి. ఎండ, చలి ఉంటుంది. కానీ వర్షం పడదు. ఎందుకంటే … ఆ గ్రామం మేఘాల పైన ఉంటుంది. మేఘాలపై ఉంటే .. వర్షం ఎలా పడుతుంది. ఆ గ్రామమే.. అల్ హుతైబ్. యెమెన్ రాజధాని సనా పరిధిలోని ఓ చిన్న గ్రామం. ఈ గ్రామం భూ ఉపరితలానికి 3200 మీటర్ల ఎత్తులో ఓ పెద్ద కొండ పై ఉంటుంది. అందుకే ఇక్కడ వర్షం పడదు. ఆ గ్రామం మేఘాలపై ఉండటమే అందుకు కారణం. కానీ ఈ గ్రామానికి పర్యాటకంగా మంచి పేరు ఉంది. మేఘాల నుంచి భూమిపైకి వర్షం పడే సుందర దృశ్యాలను ఈ గ్రామం నుంచి చూడవచ్చు. అందుకే ఇక్కడికి పర్యాటకులు తరుచూ వస్తుంటారు.