వర్క్ ఫ్రం హోం.. ఇలాగే కొనసాగితే కష్టమే !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన లాక్ డౌన్ కారణంగా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో ఉద్యోగుల జీవన శైలి మారిపోయింది. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గంటల తరబడి పని చేయడం, తినడం, నిద్రపోవడం.. ఇదే నిత్య దినచర్యగా మారింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల మానసిక, శారీరక చర్యలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. మరో ఐదేళ్లు వర్క్ ఫ్రం హోం ఇలాగే కొనసాగితే.. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని లాయిడ్స్ ఫార్మసి డాక్టర్స్ అనే ఆన్ లైన్ డాక్టర్ కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది. ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చోవడం, సరైన భంగిమల్లో కూర్చోకపోవడం వల్ల శారీరక నొప్పులతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసుకు వెళ్లే పనిలేకపోవడంతో.. కొందరు ఆలస్యంగా నిద్రలేస్తూ.. వ్యాయమం చేయడంలేదు. ఇంట్లోనే పనిచేస్తున్న కారణంగా చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. దీని వల్ల వెయిట్ పెరగుతున్నారు. బయటికి వెళ్లకపోవడం వల్ల సూర్యరశ్మి పడకపోవడం కారణంగా.. డి విటమిన్ పొందలేకపోతున్నారు. ఇలాంటి జీవన శైలి వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతారని లాయిడ్స్ ఫార్మసి డాక్టర్స్ సంస్థ వెల్లడించింది.