NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ ఫోన్ బ్యాట‌రీ ఎక్కువకాలం ప‌ని చేయాలంటే.. ఇలా చేయండి

1 min read

Abstract Battery supply digital concept

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్ని వేలు పోసి కొత్త ఫోన్ కొన్నా.. ఎన్ని గొప్ప ఫీచ‌ర్లు ఉన్నా ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ కాలం మ‌న్నిక‌వ‌స్తేనే ఉప‌యోగం. లేకుంటే ఎన్ని గొప్ప ఫీచ‌ర్లు ఉన్నా నిరుప‌యోగమే. మొబైల్ కంపెనీలు వేగ‌వంత‌మైన చార్జింగ్ టెక్నాల‌జీని అభివృద్ధి చేసినా.. ఫోన్ల వినియోగం విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో చార్జింగ్ ఎక్కువ‌సేపు నిల‌వ‌డం లేదు. ఇలాంటి సంద‌ర్భంలో స్మార్ట్ ఫోన్ లో చిన్నచిన్న మార్పులు చేయ‌డం ద్వార మ‌న ఫోన్ బ్యాట‌రీ సామ‌ర్థ్యాన్ని పెంచుకోవ‌చ్చు.

  • ఫోన్ చార్జింగ్ తొంద‌ర‌గా అయిపోవ‌డానికి స్క్రీన్ బ్రైట్నెస్ ప్రధాన కార‌ణం. ఫోన్ కొన్న వెంట‌నే ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయ‌డం ఉత్తమం. బ్రైట్నెస్ ఎక్కువ‌గా ఉన్న వాల్ పేప‌ర్స్ వాడ‌క‌పోవ‌డం మంచిది. డార్క్ మోడ్ లో ఫోన్ ఉప‌యోగిస్తే ఇంకా మంచిది.
  • ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో యాప్ లు ప‌నిచేయ‌కుండా ఆండ్రాయిడ్ ఓఎస్ లో గూగుల్ కీల‌క మార్పులు చేసింది. అడాప్టివ్ బ్యాట‌రీ, బ్యాట‌రీ ఆప్టిమైజేష‌న్ వంటి ఫీచ‌ర్లను ప‌రిచ‌యం చేసింది. వీటిని ఆన్ చేసుకోవాలి.
  • మెబైల్ డేటా, వైఫై, బ్లూటూత్ అన‌వ‌స‌రంగా ఆన్ లో ఉంచొద్దు.
  • బ్యాట‌రీ సేవింగ్ యాప్ లు వాడొద్దు.
  • మీకు అవ‌స‌రం లేని ఆండ్రాయిడ్ అకౌంట్లను డిలీట్ చేయాలి. ఒక‌టి క‌న్నా ఎక్కువ ఆండ్రాయిడ్ అకౌంట్లో లాగిన్ అయితే మీ ఫోన్ కే ప్రమాదం

About Author