వేలం పాటను తగ్గించుకున్న కొంగనపల్లి మధు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి గ్రామపంచాయతీ పరిధిలోని వారపు సంత మార్కెట్, కూరగాయల మార్కెట్, మాంసపు మార్కెట్లకు గురువారం ఈవో ఆర్ డి బాలకృష్ణుడు అధ్యక్షతన , సర్పంచ్ సి. లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలం పాటలు పాల్గొనదలచిన వారు గ్రామపంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండకూడదని, గ్రామపంచాయితీ తెలిపిన ధారావత్ 6, 50, 000 చెల్లించి వేలంపాటల్లో పాల్గొని తెలిపారు.వేలం పాటలో కొంగని పల్లె మదు, ఎన్, నాగేంద్ర,రాజా సాకేత్, బో రెడ్డి రఘునాథ్ రెడ్డి ఈనాలుగురు వేలం పాటను పాడారు. లాస్ట్ కు కొంగనపల్లి మధు 8 లక్షల 41వేలకు వేలంపాటను దక్కించుకున్నారు. ఈ వేలం పాట 9 నెలలకు గాను 8 లక్షల 41 వేలు, అలాగే పోయిన సంవత్సరం వేలంపాట 9 లక్షల 80 వేలు వేలంపాట 12 నెలలకు కాను సాగిందని డిఎల్పిఓ బాలకృష్ణ, ఈవో శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి మరియు వేలంపాటకు వచ్చిన తెదేపా నాయకులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.