శ్రీరాముని పాలనే.. ఆదర్శం..
1 min read
ఆయన పాలన మాదిరిగానే.. ఎన్డీయే పాలన..
- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్
- శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి
కర్నూలు:శ్రీరాముని పాలన ఏ విధంగా ఉండేదో అదే విధంగా తమ ఎన్డీయే ప్రభుత్వ పాలన ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని నగరంలోని ఆలయాలను ఆయన సందర్శించారు. లేబర్ కాలనీ, కప్పల్ నగర్, వెంకటరమణ కాలనీ, సీతారామ్ నగర్, శ్రీరాం నగర్, అరోరా నగర్, బిర్లాగడ్డ, బుధవారపేట, బాబూజీ నగర్, దండగేరి, రాంబొట్ల దేవాలయం, జొహరాపురం, కొత్తపేట ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చి రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వంపై రాములవారి ఆశీస్సులు ఉండాలన్నారు. అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణం పూర్తైన ఈ తరంలో మనం పుట్టడం మన అదృష్టమన్నారు.
