కమనీయం.. శ్రీ రాముడి కళ్యాణం..
1 min read
మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం కమనీయం గా జరిగింది. ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చనాలా నడుమ శ్రీ ఆంజనేయ స్వామికి, ఉత్సవ మూర్థులు సీతారామ సహిత లక్ష్మణ స్వామి వారికీ పాలు, పెరుగు, తేనె,కొబ్బరినీరు వంటి వివిధ పళ్ళ రసాలు ద్రవ్యాలతో విశేష పంచామృతాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అభిజిత్ లగ్నం లో అసూరి సునీల్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కమనీయం గా నిర్వహించారు. ముందుగా విశ్వక్ సేనా పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, కంకణ ధారణ, మాంగళ్య ధారణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు,భాజా భజంత్రీలు నడుమ శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపైన వేంచింప జేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమణయ్య, భీమాచార్యులు, మధుసూదనా చార్యులు, సూర్యనారాయణ చార్యులు భాస్కరాచార్యులు శ్రీనివాసచార్యులు సత్యనారాయణ,వెంకటేష్, మంత్రాలయం మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్ తెల్ల బండ్ల భీమయ్య, కురువ మల్లికార్జున, శివప్ప మరియు టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజులు, గోల్డ్ స్మిత్ నరసింహ మరియు గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
