మంత్రి పై తప్పుడు ఆరోపణలు సరికాదు..
1 min read
ముస్లింలకు అండగా మంత్రి టి.జి. భరత్ నిలుస్తారు..
- ముస్లింలను మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
- మండిపడిన టిడిపి మైనారిటీ విభాగం నాయకులు
కర్నూలు : కర్నూల్లోని ముస్లిం సోదర, సోదరీమణులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అండగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మైనారిటీ విభాగం నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి టి.జి భరత్పై వైసీపీ నాయకులు అహ్మద్ ఆలీఖాన్ చేసిన వ్యాఖ్యాలపై టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఏఏ, ఎన్.ఆర్.సి విషయంలో ముస్లింలకు మద్దతుగా నిలుస్తామని తమ నాయకుడు టి.జి భరత్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారన్నారు. కర్నూల్లోని ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి సైతం అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత టి.జి భరత్ తీసుకుంటారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లింలకు ఎప్పటికీ అన్యాయం జరగదన్నారు. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు కేవలం రాజకీయ లబ్ది కోసమే వక్ఫ్ సవరణ బిల్లును సాకుగా చూపుతూ మంత్రి టి.జి భరత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో సీఏఏ, ఎన్.ఆర్.సి బిల్లులకు వైసీపీ మద్దతిచ్చిందని టిడిపి నాయకులు గుర్తు చేశారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు సైతం లోక్సభలో మద్దతు ఇవ్వకుండా, రాజ్యసభలో మద్దతు ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు 3 సవరణలు సూచించిందన్నారు. రాజకీయ లబ్ది కోసం అహ్మద్ ఆలీఖాన్.. మంత్రి టి.జి భరత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మంత్రి టి.జి భరత్ కర్నూలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే నాయకుడన్నారు. టి.జి భరత్ గురించి మాట్లాడే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదన్నారు. ఇకనైనా ఆయనపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ఘాటుగా మాట్లాడారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహీద్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు హమీద్, తెలుగుయువత కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్, మైనారిటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ ఆలీఖాన్, మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి రబ్బాని, సభ్యులు రమీజ్, మెహబూబ్, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.