తల్లులు గర్భిణిగా ఉన్న సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం విషయం లో “ఆరోగ్యకరమైన ప్రారంభం – ఆశాజనక భవిష్యత్తు” నినాదంతో ముందుకు సాగాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. సోమవారం కర్నూల్ మెడికల్ కాలేజీలో యన్.యస్.యస్ & కమ్యునిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో న్యూ లెక్చరర్ గ్యాలరీ యందు “ప్రపంచ ఆరోగ్య దినోత్సవం” ఏప్రిల్ 7 ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లులు గర్భిణిగా ఉన్న సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, టీకాలు, సురక్షితమైన ప్రదేశంలో కాన్పులు కావడం, కాన్పు తర్వాత తల్లి బిడ్డల అరోగ్యం విషయంలో ప్రతిష్టమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం ద్వారా తల్లి మరియు పిల్లల భవిష్యత్తు ఆశాజనకంగా ఆరోగ్యకరంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ విభాగం నిర్వహించిన క్విజ్ యందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్. హరి చరణ్, డాక్టర్ రేణుకా దేవి, కమ్యూనిటీ మెడిషన్ విభాగము ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి డాక్టర్ సుధా కుమారి, ప్రొఫెసర్ సింధియాశుభప్రద యన్.యస్.యస్ కార్యక్రమ అదికారి డా. అరుణ మరియు వివిధ విభాగాల అధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ, యూజి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.