మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వసంతోత్సవ వేడుకలు
1 min read
ప్రవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం
కొండలరావుపాలెం హెచ్ఎం కిరణ్మయ
న్యూస్ నేడు, ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని పెదవేగి మండలం కొండలరావు పాలెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కిరణమై అన్నారు. పెదవేగి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వసంతోత్సవ వేడుకలను విద్యార్థులు,వారి తల్లిదండ్రుల, గ్రామస్తులు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి పాఠ్య ప్రణాళికలను నవీకరించడం, అధునాతన బోధనా పద్ధతులను అవలంబించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.అనంతరం విద్యార్థులతో పాటు, గ్రామస్తులు సహ పoక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రమీలరాణి, ఎస్ఎంసి చైర్మన్ అక్కినేని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ తానంకి రవికుమార్, గ్రామస్తులు పాలడుగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.