NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ఎస్పీ ఆదేశాలతో  ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి అరెస్టులు 

1 min read

 స్కూటీ డిక్కీ దొంగతనాలలు, జులుం ప్రదర్శించిన దొంగల అరెస్ట్

వారి వద్ద నుండి  5లక్షల రూపాయలు మరియు  ఒక  పల్సర్ మోటర్ సైకిల్  స్వాధీనం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు  మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు  డిక్కీ దొంగతనాలు 1. Cr.No 78/2025 U/s 308 (5) BNS, 2) Cr.No 66/2025 U/s 303(2) BNS కేసు లలో  నిందితులను గుర్తించి, వారి వద్ద నుండి  ఐదు లక్షల రూపాయలు మరియుఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్  ఆదేశాల మేరకు  ఎస్ డి పి ఓ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో సిఐ లు కోటేశ్వరరావు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిహెచ్. రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ స్టేషన్  మరియు వారి  ప్రత్యేక బృంద సబ్యులు  ఎస్ఐ

పి.రాంబాబు, ఎస్ఐ పి.అప్పారావు వారి  మరియు 3  టౌన్ పోలీస్ స్టేషన్, & సి సి ఎస్ పోలీస్ స్టేషన్  సిబ్బంది తో  ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరియు నేరాలు జరిగిన తీరు సీసీ ఫుటేజ్ ల ద్వారా  బట్టి నిందితులను గుర్తించి, ముద్దాయి లను ది. 7.4.2025 తేది నాడు ఏలూరు మినీ బైపాస్  పెదపాడు. బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేసి  వారి వద్ద నుండి రెండు కేసులలో 5,00,000/-, మరియు పల్సర్ మోటార్ సైకిల్ ని   స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి ల వివరాలు.

1.షేక్ గాల్సిద్ @ సాహిద్ 

s/o  జైన వలి, వయస్సు-29 సంవత్సరాలు, కులం-ముస్లిం, కుమ్మరి బజార్, వీటీసీ మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా.

2.బొంతు రాజశేఖర్ రెడ్డి@ అమూల్ రెడ్డి s/o మురళీ కృష్ణారెడ్డి, వయస్సు-27 సంవత్సరాలు, కులం-రెడ్డి, నివాసం-  చిలుకూరి వారి గూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా.ముద్దాయిలు నేరం చేస్తే విధానం:  ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటు పడడం తో డబ్బులు అవసరమయి బ్యాంకుల వద్ద నిలబడి ఎవరైతే బ్యాంకు నుండి డబ్బులు విత్ డ్రా చేసి తీసుకుని స్కూటీ డిక్కీలో పెడుతున్నారో వాళ్లను వెంబడించి స్కూటీ పార్క్ చేసిన తర్వాత స్కూటీ డిక్కీ తెరిచి డబ్బులు దొంగిలించడం, అదేవిధంగా ఎవరైనా ఒంటరిగా డబ్బులతో ప్రయాణించడం గమనించి వారిని అనుసరించి  మార్గ మధ్యలో వారిని చంపుతామని జలుం ప్రదర్శించి వారి వద్ద నుండి బలవంతం గా  డబ్బులు తీసుకుని దొంగతనం పాల్పడడం చేస్తున్నారు.ఈ కేసులో  ప్రతిభ కనబరిచిన ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు  ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మరియు 3 టౌన్ ఎస్ఐ పి రాంబాబు, ఎస్ ఐ పి.అప్పారావు  మరియు హెచ్ సి ఓం ప్రకాష్ మరియు సిసిఎస్  పోలీస్ స్టేషన్  సిబ్బంది ఆహామాద్, రాజ్ కుమార్, రజని, రామకృష్ణ, అనువార్లను ఎస్పీ  అభినందించారు.

About Author