హనుమాన్ శోభయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలి
1 min read
ఆదోని సబ్ కలెక్టర్, వత్తికొండ డీఎస్పీ
హొళగుందలో పీస్ కమిటీ మీటింగ్
హొళగుంద పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతున్న ఆదోని సబ్ కలెక్టర్ మార్య భరద్వాజ్
మాట్లాడుతున్న వత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య
హాజరైన ఆయా వర్గాల గ్రామపెద్దలు
హొళగుంద, న్యూస్ నేడు: ఈ నెల 12న హనుమాన్ జయంతిని వునస్కరించుకుని మండల కేంద్రంలో జరిగే హనుమాన్ శోభయాత్రను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆదోని నబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య కోరారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయా వర్గాలకు చెందిన గ్రామపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన సంఘటనల వల్ల అమాయక యువకులు కూడా కేసుల్లో ఇరుక్కుని నేడు బాధ పడ్తున్నారన్నారు. ఎవరో కొందరు అల్లరిమూకలు చేసిన వుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషియల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ల వల్ల అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న ఆయా మతాల మద్య గౌడవలు జరుగుతాయన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉండి శాంతంగా ఉండే ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో సహనం తప్పి అనాగరికులుగా వ్యవహారిస్తారని ఇలాంటి వారిని అల్లరిమూకలు రెచ్చగొట్టడం వల్ల పరిస్థితి దారుణంగ మారుతుందని డీఎస్పీ అన్నారు. కొందరు పోస్టింగ్లు పెట్టి ఇరువర్గాల మధ్య ద్వేషాన్ని పెంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ఈ పోస్టింగ్లు పెట్టే వారి పై నిఘా ఉంచామని అలాంటి వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వీళ్లు చేసే నిర్వాహాకం వల్ల అమాయక ప్రజలు, యువకులు నష్టపోతారని కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటారన్నారు. అలాంటి వారిని ఇరువర్గాల వారు కట్టడి చెయాలని లేదా వాళ్ల సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇరువర్గాలకు చెందిన వారు రాగద్వేషాలకు వెళ్లకుండ, భవిషత్తు అందకారం చేసుకోకుండ ఉత్సవాలను అన్నదమ్ముల కలిసి మెలిసి చేసుకోవాలని అయా వర్గాల వారి ఆధారాలను, సంప్రదాయలను గౌరవించాలని కోరారు. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకుని శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చూడాలని కోరారు.