లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు అందుకున్న సూచీలు ఆద్యంతం లాభాల్లో నడిచాయి. అమెరికన్ ప్యూచర్స్ గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు కూడ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ-50 ..112 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 412 పాయింట్ల లాభంతో 35,222 వద్ద ట్రేడింగ్ ముగిసింది.