16న వ్యాసరచన పోటీలు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో పృథ్వి దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ పర్యావరణ పరిరక్షణ లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పాత్ర ‘ అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యాసరచన పోటీలను నిర్వహించబడతాయని 4 నుంచి 10 సంవత్సరాల్లోపు వారిని సబ్ జూనియర్స్ గానూ, 11 నుంచి 15 సంవత్సరాలలోపు వారిని జూనియర్స్ గానూ ,15 సంవత్సరాలు పైబడిన వారిని సీనియర్స్ గాను పరిణింపబడతారని ప్రతి విభాగం నుంచి ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని ఆసక్తి గల వారు తమ పేర్లను వెంకటరమణ కాలనీ మొదటి లైన్లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని లేదా 9396861308 నెంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు.