PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాజల్‌ దూకుడు

1 min read

సినిమా డెస్క్​: బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేసేస్తోంది కాజల్‌ అగర్వాల్‌. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తూ పెళ్లయిన నెల రోజులకే ‘ఆచార్య’ షూటింగ్‌ సెట్‌ లో జాయినైపోయింది కూడా. అలాగే అన్‌లాక్‌ తర్వాత మొదలైన షూటింగ్‌లలో కూడా పాల్గొంటోంది. కాజల్‌ లీడ్‌ రోల్‌లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఉమ’ షూటింగ్ నిన్న కోల్‌కతాలో స్టార్ట్ అయింది. కాజల్ తో సహా యూనిట్ అంతా షూట్ లో జాయిన్ అయ్యారు. యాడ్ ఫిల్మ్ మేకర్ తథాగత సింఘా తెరకెక్కిస్తున్నాడు. మిరాజ్ గ్రూప్ తో అవిషేక్ ఘోష్, మంత్రాజ్ పైల్వాల్ నిర్మిస్తున్నారు.

మేఘనా మాలిక్, హర్ష్ చాయా, తిన్ను ఆనంద్, గౌరవ్ శర్మ, శ్రీస్వర, ఆయుషిత లోక్దార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ట్ టు ఫినిష్ అంటూ సింగిల్ షెడ్యూల్ లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటోందిట టీమ్. ఈ మూవీలో తనదో డిఫరెంట్‌ రోల్‌ అని.. హాలీవుడ్ మూవీ ‘మేరీ పాపిన్స్’ తరహాలో ఉంటుందని చెప్పింది కాజల్‌. అందుకే సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి. పెళ్లి జరుగుతున్న ఓ ఇంట్లో ఉమ అనే అమ్మాయి వల్ల ఎలాంటి మార్పులు వస్తాయన్నదే కథ. ఇది పెళ్లి తర్వాత కాజల్ నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ . ఇదిలా ఉంటే ‘ఆచార్య’ లో తన చిరంజీవి పక్కన, ప్రవీణ్ సత్తారు మూవీలో అక్కినేని నాగార్జునకు జోడీగా నటిస్తోంది కాజల్. కమల్ ‘ఇండియన్ 2’ ప్రాజెక్టులో కూడా నటిస్తున్న కాజల్‌కి హే సినిమికా, ఘోస్టీ సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి.

About Author