దిగ్విజయంగా పూర్తయిన తొలివిడత పట్టాల పంపిణీ!
1 min read
5రోజులపాటు పండుగలా మనఇల్లు – మనలోకేష్ కార్యక్రమం
3,005 మందికి బట్టలు పెట్టి పట్టాలను అందించిన లోకేష్
మంగళగిరి , న్యూస్ నేడు : మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్ధాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు – మన లోకేష్ పేరుతో మంత్రి నారా లోకేష్ పరిష్కారం చూపారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న 3,005 మందికి తొలివిడతలో శాశ్వత పట్టాలు పట్టాలు అందజేశారు. మంగళగిరి రూరల్ డాన్ బాస్కో స్కూలు ఆవరణలో 5రోజులపాటు పండుగ వాతావరణంలో నిర్వహించిన పట్టాల పంపిణీ తొలివిడత కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. లబ్ధిదారులందరికీ బట్టలు పెట్టి పట్టాలు అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తం 5రోజుల కార్యక్రమంలో రత్నాల చెరువు – 729, మహానాడు -1లో 473, మహానాడు -2లో 441, యర్రబాలెం – 274, కొలనుకొండ – 235, పెనుమాక – 185మంది, పద్మశాలి బజార్ – 137, డ్రైవర్స్ కాలనీ – 119, నీరుకొండ – 99, సలాం సెంటర్ – 92, ఉండవల్లి 82, ఉండవల్లి సెంటర్ – 85, సీతానగరం – 48, ఇప్పటం – 10మందికి కలిపి మొత్తంగా 3,005 మందికి మంత్రి లోకేష్ చేతులమీదుగా పట్టాలు అందజేశారు. ఈనెల 3వతేదీన మంత్రి లోకేష్ ఉండవల్లి రజకుల కాలనీకి చెందిన రాజమండ్రి గోవిందు కుటుంబానికి తొలి పట్టాను వారి ఇంటికి వెళ్లి అందజేశారు. 2వరోజున (4-4-2025)న యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో యర్రబాలెం, నీరుకొండ, రత్నాల చెరువు లబ్ధిదారులకు, 3వరోజు (7-4-2025)న కొలనుకొండ, పద్మశాలి బజార్, పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం గ్రామాలకు చెందిన వారికి, 4వరోజున (11-4-2025)న రత్నాల చెరువు, మహానాడు కాలనీకి చెందిన లబ్ధిదారులకు, 5వరోజున (13-4-2025) మహానాడు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సలాం సెంటర్, ఉండవల్లి సెంటర్, సీతానగరం, పద్మశాలి బజార్ కు చెందిన వారికి మంత్రి లోకేష్ శాశ్వత పట్టాలు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే పేదల కోసం మంత్రి లోకేష్ చొరవతో తెచ్చిన జిఓ 30 రాష్ట్రవ్యాప్తంగా పేదప్రజలందరికీ ప్రయోజనం కలిగించబోతోంది. గత శాసనసభ్యులకు భిన్నంగా లోకేష్ ఇచ్చిన మాట బెట్టుకొని మంగళగిరి ప్రజల ప్రశంసలందుకొన్నారు.
