NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని  డిఆర్ఓ ఛాంబర్ లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ మొదటి విడతలో  26,785 మంది వయోజన నిరక్షరాస్యులలో 23,861 మంది అక్షరాసులుగా తీర్చిదిద్ది..  పరీక్షలు నిర్వహించగా  23,224 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రెండవ విడతలో 30,443 వయోజన నిరక్షరాస్యులను అక్షరాలను అక్షరాసులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో  స్వయం స్వయం సహాయక సంఘాల పరిధిలోని వయోజనులను అక్షరాసులుగా చేసేందుకు విద్యనభ్యసించిన గ్రూప్ లీడర్లను గుర్తించి నియమించాలని డిఆర్డిఏ పిడిని సూచించారు.వయోజన విద్య ఉపసంచాలకులు చంద్ర శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక బృందం (ఎస్.హెచ్.జి) సభ్యులు, వంట సహాయకులు, వాచ్మెన్, ప్రభుత్వ సహాయక పాఠశాలలు, అంగన్వాడీ సహాయకులు/ ఆయాలు మరియు ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులలో క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత సాధించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల మహిళలు సంతకం పెట్టలేని పరిస్థితి ఆయా సంఘాల్లో ఉందని … సంబంధిత వ్యక్తులు సంతకం పెట్టేలా, చదవగలిగేలా విద్యను బోధించాలని తెలిపారు. రెండవ విడత ఉల్లాస్ కార్యక్రమం కింద ఈనెల 16వ తేదీ నుంచి ఆరు రోజులపాటు సర్వే మొదలు పెట్టి నిరక్షరాస్యులను గుర్తించాల్సి ఉందని, సర్వే చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు అక్షరాస్యత నేర్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం ఐదు నెలల పాటు 200 గంటల వ్యవధిలో రోజుకు 2 గంటల పాటు అమలు అయ్యేలా రూపొందించబడిందన్నారు. అంగన్ వాడి కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లను సాయంత్రం రెండు గంటల పాటు అక్షరాస్యత కేంద్రాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా అమలు చేయాలని ఆయా శాఖల అధికారులను డిఆర్ఓ ఆదేశించారు.ఈ సమావేశంలో డీఆర్డీఏ పిడి శ్రీధర్ రెడ్డి, డిపిఓ జమిఉల్లా, డిఎల్డిఓ శివారెడ్డి, మెప్మా  మేనేజర్ రాములు, డీఈఓ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *