నడిచే రాఘవేంద్రుడు శ్రీ సుశమీంద్ర తీర్థుల ఆరాధన
1 min read
స్వర్ణ రథంపై శ్రీ సుశమీంద్ర తీర్థుల చిత్ర పటం ఊరేగింపు
టిటిడి పట్టువస్త్రాలు సమర్పణ
మంత్రాలయం, న్యూస్ నేడు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం నడిచే రాఘవేంద్రుడు అని పిలువబడే పూర్వపు పీఠాధిపతులు సుశమీంద్రతీర్థులు ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుశమీంద్రతీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం వివిధ రకాల పూజలు చేశారు. అనంతరం సుశమీంద్ర తీర్థుల చిత్ర పటాన్ని స్వర్ణ రథం ఉంచి భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య మఠం ప్రాకారంలో ఊరేగించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనన్నికి విశేష పంచామృతాభిషేకం, ఫల పుష్పాభి షేకం తదితర ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి చేశారు. సంస్థాన పూజల్లో భాగంగా మూల రామదేవతలకు అభిషేకాలు చేసి, ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. టిటిడి పట్టువస్త్రాలు సమర్పణ : రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు సుశమీంద్రతీర్థుల ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి ఏఈఓ మోహన్ రాజ్ శ్రీవారి వస్త్రాలను తీసుకువచ్చారు. వారికి మఠం అధికారులు మఠం ముఖద్వారం దగ్గర మఠం వరకు స్వాగతం పలికారు. పట్టువస్త్రాలను పీఠాధిపతులకు అందజేశారు.పట్టువస్త్రాలు రాఘవేంద్రస్వామి మూల బృందావనం దగ్గర నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామీజీ సుశమీంద్ర తీర్థ మూల బృందావనానికి శ్రీవారి వస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పతి అవార్డు గ్రహీత పండిత కేసరి రాజా యస్ గిరియ్యాచారులు , మఠం ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్లు సురేష్ కోనపూర్ , వెంకటేష్ జోషి , సహయ మేనేజర్ ఐపి నరసింహ స్వామి , పిఆర్వో హోనళ్ళి వ్యాసరాజాచార్ , మఠం సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు.

