ఘనంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశం నిర్వహణ
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక సూచనలతో, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠ ఆదేశాల మేరకు, పార్టీ పట్టణ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు పట్టణ కమిటీ తొలి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షులు శ్రీ కామర్తి నాగేశప్ప అధ్యక్షత వహించారు.సమావేశంలో పట్టణంలోని ముఖ్య నాయకులు, విభాగాల ఇంచార్జ్‌లు, యువజన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తెలియజేయడంపై విశ్లేషణాత్మకంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు శ్రీ కామర్తి నాగేశప్ప మాట్లాడుతూ “ప్రస్తుత మోదీ-బాబు కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నది. బీసీలకు న్యాయం చేయకుండా, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా, పింఛన్ లను తగ్గించి, ప్రజల నిత్యావసరాలకు భారం మోపే విధంగా పాలన కొనసాగిస్తున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నేతలు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి అసలైన సమాచారం అందించాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న నిబద్ధత, ప్రజా సంక్షేమంపై మక్కువను తెలియజేయాలనీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బూత్ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కార్యకర్తలు మరింత చురుగ్గా పని చేసి, పార్టీ గెలుపుకోసం నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు.ప్రజల్లో ఎదురవుతున్న సమస్యలు, పట్టణాభివృద్ధికి అవసరమైన చర్యలు, స్థానికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు.పార్టీ పట్ల నమ్మకం, నాయకత్వంపై విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని నాయకత్వం పిలుపునిచ్చింది.ఈకార్యక్రమంలో జిల్లా/నియోజకవర్గ/పట్టణ కమిటీల సభ్యులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.