రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు పరిశీలన
1 min read
సీఎం చంద్రబాబు నాయుడి మారదర్శక ప్రయత్నం అభినందనీయం
రెన్యువబుల్ ఎనర్జీ కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి
కర్నూలు, న్యూస్ నేడు : ప్రపంచస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని కేంద్ర కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ &పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, న్యూ,& రెన్యువబుల్ ఎనర్జీ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. శుక్రవారం ఓర్వకల్లు మండలం గని సమీపంలో ఉన్న సోలార్ పార్క్, గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, విండ్ పవర్ ప్రాజెక్ట్ లను హెలికాప్టర్ ద్వారా మంత్రి పరిశీలించిన అనంతరం అప్పర్ ఇన్ టేక్ పాయింట్ రిజర్వాయర్ నుండి నీటిని పైపు ల ద్వారా టర్బైన్ ల వరకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ యొక్క వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద రకమైన ప్రాజెక్ట్ గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ మన దేశంలో ఉండడం గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ సామర్థ్యానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అన్నారు. ఈ మార్గదర్శక ప్రయత్నాన్ని సాధ్యం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. గ్రీన్ కో సంస్థ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని అదే విధంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, నిల్వ మరియు డిమాండ్‌పై సరఫరా కోసం రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఇంధన భద్రతను పెంచడంలో మరియు పర్యావరణ అనుకూల వనరులకు పరివర్తనను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్ కో సంస్థ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్, కర్నూలు బిజెపి జిల్లా ఇన్చార్జి అంకాల రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
