నిరహార దీక్షకు సంఘీభావం తెలిపిన చిప్పగిరి లక్ష్మీనారాయణ..
1 min read
ఆలూరు, న్యూస్ నేడు : ఆదోని నియోజకవర్గంలో నెలకోన్న ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీ పనులు పూర్తి కాకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాలేజీ నిర్మాణం పూర్తయితే పక్క నియోజకవర్గలలో మెడిసిన్ చదవలనుకుంటున్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేతుల్లో చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చి కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తప్పుడు కేసులతో మా నాయకులను భయపెట్టలేరని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుంబలబీడు లక్ష్మన్న చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, తాయన్న, వీరాంజనేయులు మరియు వెంకటేష్ పాల్గొన్నారు.