ఉప్పలదడియ లో ఘనంగా గుడ్ ఫ్రైడే..
1 min read
ఎస్ఐ ఓబులేష్ ఆధ్వర్యంలో బందోబస్తు..
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో అన్ని గ్రామాల్లో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు ఆధ్వర్యంలో ఉప్పలదడియ ఆర్ సీఎం చర్చి వద్ద 9 గంటలకు ప్రారంభమైన సిలువ యాత్ర రోడ్డు మార్గాన దిగువపాడు గట్టు పైన ఉన్న కల్వరి కొండ గుడి వరకు క్రైస్తవులు సిలువను మోసుకుంటూ సిలువ యాత్ర చేశారు.ఈ శిలువ యాత్రలో ఏసుక్రీస్తు సిలువలో పడిన బాధలను 14 స్థలాలను స్మరించుకున్నారు. విచారణలోని ఉప్పలదడియ కలమందల పాడు మాసపేట కడుమూరు చౌటుకూరు,49 బన్నూరు,దేవనూరు కేతవరం దిగువపాడు 10 గ్రామాల క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.కల్వరికొండ గుడి దగ్గర విచారణ గురువులు మధుబాబు దివ్య బలి పూజ సమర్పించారు.ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు గురించి సందేశం ఇచ్చారు.ఏసుక్రీస్తుకు విరుద్ధముగా మానవులు చేసిన పాపములకు గాను ఆయన శిలువపై అతి ఘోరంగా మరణించారని అన్నారు.వచ్చిన వారందరికీ కేతవరం కొమిరే రాజు,లావణ్య భోజనాలు తయారు చేయించారు.అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మిడుతూర్ ఎస్ఐ హెచ్ ఓబులేష్,హెడ్ కానిస్టేబుల్ గోవిందు,శ్రీనివాసులు,శీను ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ థోమాస్, పక్కిరయ్య,ఆనందరావు, సామన్న,హరి,ఫ్రాన్సిస్,ఈరన్న,సిద్దయ్య మరియు వివిధ గ్రామాల నుండి దాదాపు 1200 మంది పాల్గొన్నారు.
