నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ సందడి
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: వస్త్ర రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో రెండవ షోరూమ్ ఏర్పాటు చేసింది. బీసెంట్ రోడ్ క్రాస్ వద్ద ఏర్పాటైన ఈ అధునాతన షోరూమ్ ను ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూమ్ అంతా కలయదిరిగి వైవిద్య భరితమైన వస్త్ర శ్రేణిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ 14వ షోరూం, విజయవాడలో రెండవ షో రూమ్ను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు వైవిద్య భరితమైన వస్త్రాలు ఉన్నాయని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలంతా ఈ షోరూం సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. అనంతరం ఆర్ఎస్ బ్రదర్స్ తరఫున పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, పి ప్రసాదరావు మాట్లాడుతూ సినీనటి కీర్తి సురేష్ తన షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరల్లో తమ షోరూంలో లభ్యమవుతాయని తెలిపారు . ఖాతాదారుల అభిరుచులను అనుగుణంగా అన్ని రకాల పట్టుచీరలతో పాటు స్పెషల్ కలెక్షన్, ఆధునిక వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్ వేర్ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని, కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాలనుకునే వారికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని వివరించారు. తొలుత ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి షోరూంను సందర్శించి ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఇలాంటి షో రూమ్ లు మరిన్ని రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు.
