కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్, కర్నూలు మరియు ఐసిడిఎస్ ప్రాజెక్ట్, కర్నూలు వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మలా నగర్, కర్నూలు (అర్బన్) అంగన్ వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ అనురాథ మాట్లాడుతూ పోషణ్ అభియాన్ శిశువు జీవితంలోని మొదటి 1000 రోజుల పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను మరియు పోషణ్ ట్రాకర్ యొక్క ఉపయోగాన్ని తెలియజేశారు.క్షేత్ర ప్రచార సహాయకులు ఫణికుమార్ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు మరియు పిల్లలపై ప్రధానంగా దృష్టి సారించి పోషకాహార భారత్‌ను నిర్మించే దిశగా ఒక అడుగు ముందుకు వేయడం అని అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. పోషణ పక్వాడాలో భాగంగా పౌష్టికాహార ప్రదర్శన, గర్భవతులకు సీమంతాలు మరియు పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు మరియు మహిళలు పాల్గొన్నారు.
