ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పిఆర్సీ ఇవ్వాలి…
1 min read
ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ నాయక్
ప్యాపిలి, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్సనర్లకు వేతన సవరణ కు సంబంధించిన 12 వ పీఆర్సీ కమీషన్ ని వెంటనే నియమించాలని , ఉద్యోగులకు మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయు) రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ నాయక్ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా వాణి కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ11వ పీఆర్సీ గడువు ముగిసి 20 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా పీఆర్సీ ప్రకటించకపోవడం ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్సనర్లను ఆందోళనకు గురి చేస్తుందన్నారు.ఎస్టీయు మండల అధ్యక్షులు హాజీ మస్తాన్ వలి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ (కరవుభత్యం) బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు వెంకట్ నాయక్, చిన్నపరెడ్డి, హాజీ మస్తాన్ వలి, నాగ మల్లేష్, ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.